Abn logo
Apr 22 2021 @ 01:00AM

తిరుమలలో చిరుతపులి కలకలం

తిరుమల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో బుధవారం రాత్రి చిరుతపులి కలకలం రేగింది. రాత్రి ఎనిమిది గంటలకు స్థానికులు నివాసముండే ఈస్ట్‌ బాలాజీనగర్‌ 1060 నెంబరు గల ఇంటి సమీపానికి వచ్చిన చిరుతపులిని స్థానికులు గుర్తించారు. వెంటనే భయంతో కేకలు వేస్తూ ఇళ్లలోకి పరుగులు తీశారు. స్థానికుల అరుపులతో పులి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు సంఘటనా చేరుకుని స్థానికులను అప్రమత్తం చేశారు. రాత్రి వేళలో ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో పులులు పలుమార్లు కనిపించడం గమనార్హం. 

Advertisement
Advertisement
Advertisement