Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాత్రి 7 గంటలు.. ఇంటి ముందున్న బాత్రూంకు వెళ్లిన 26 ఏళ్ల యువతి.. ఇంతలో సడన్‌గా అరుపులు, కేకలు.. ఆమె తండ్రి వెళ్లి చూస్తే..

రాత్రి ఏడు గంటల సమయం.. ఊరంతా ప్రశాంతంగా ఉంది.. ఓ ఇంట్లోని యువతి బాత్రూంకు వెళ్లేందుకు బయటకు వచ్చింది.. కొద్ది సేపటికి ఆమె గట్టిగా అరుపులు, కేకలు వేయడం ప్రారంభించింది.. ఏమైందా అని చుట్టుపక్కల వారు బయటకు వచ్చారు.. ఆ యువతిని ఓ చిరుతపులి ఈడ్చుకుంటూ వెళ్లిపోతోంది.. దీంతో అందరూ కత్తులు, బరిసెలు పట్టుకుని వెంటాడారు.. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


సిమ్లాకు సమీపంలోని జాబలి గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతి పూజ బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో బాత్రూంకు వెళ్లేందుకని ఇంటి నుంచి బయటకు వచ్చింది. అక్కడే కాచుకుని కూర్చున్న చిరుతపులి ఆమెపై దాడి చేసింది. దీంతో పూజ పెద్దగా అరుపులు, కేకలు పెట్టింది. ఆ కేకలు విని ఇంట్లో నుంచి ఆమె తండ్రి బయటకు వచ్చాడు. అతను వచ్చే సరికి చిరుతపులి పూజను ఈడ్చుకుంటూ వెళ్తోంది. దీంతో ఆయన గట్టిగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని పిలిచాడు. 


అందరూ కర్రలు, బరిసెలు పట్టుకుని చిరుతపులి వెంటపడ్డారు. దీంతో పూజను వదిలేసి చిరుతపులి పారిపోయింది. ఈ ఘటనలో పూజకు చిన్న చిన్న గాయాలయ్యాయి. గ్రామానికి సమీపంలో చిరుతపులి సంచరిస్తోందని తెలియడంతో అందరూ హడలిపోతున్నారు. ఆ గ్రామ సర్పంచ్ ఆ ఘటన గురించి వెంటనే అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ చిరుతపులిని పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది సమాయత్తమవుతున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement