అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి దూరిన చిరుతపులి.. గేటు దూకి మరీ లోపలికి వచ్చి..

ABN , First Publish Date - 2021-12-27T19:53:47+05:30 IST

ఓ చిరుతపులి లక్నోలో హల్‌చల్ చేసింది. అటవీ శాఖ అధికారుల నుంచి కూడా తప్పించుకుని నగరంలో తిరిగింది.

అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి దూరిన చిరుతపులి.. గేటు దూకి మరీ లోపలికి వచ్చి..

ఓ చిరుతపులి లక్నోలో హల్‌చల్ చేసింది. అటవీ శాఖ అధికారుల నుంచి కూడా తప్పించుకుని నగరంలో తిరిగింది. 15 మందిని గాయపరిచింది. అనంతరం బాలికల హాస్టల్‌లోకి చొరబడింది. దీంతో అందరూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. చిరుత గేటు దూకి బాలికల హాస్టల్‌లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యాయి. 


రెండ్రోజులుగా చిరుతపులి లక్నో నగరంలో తిరుగుతోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శనివారం వల పన్ని దానిని పట్టుకున్నారు. అయితే ఆ వలను చిరుతపులి చీల్చేసింది. అక్కడ ఉన్న 15 మందిని గాయపరిచి పారిపోయింది. తర్వాత దాని ఆచూకీ తెలియలేదు. ఆ పులి శనివారం రాత్రి 12 గంటల సమయంలో బాలికల హాస్టల్ గేటు దూకి లోపలికి ప్రవేశించింది. అయితే అందరూ తలుపులు వేసుకుని నిద్రపోవడంతో ఎవరికీ హాని జరగలేదు. అక్కణ్నుంచి తప్పించుకున్న పులి ఇప్పటి వరకు అటవీ శాఖ అధికారులకు దొరకలేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

Updated Date - 2021-12-27T19:53:47+05:30 IST