Abn logo
Dec 1 2020 @ 00:17AM

మల్కపేటలో చిరుత కలకలం

- భయాందోళనలో రైతులు

కోనరావుపేట, నవంబరు 30:  కోనరావుపేట మండలం మల్కపేట గ్రామ పొలాల్లో చిరుత పులి సంచారం స్థానికంగా కలకలం రేపి ంది.  సోమవారం ఉదయం మల్క పేటకు చెందిన రైతులు బొర్ర స్వా మి, రమేష్‌ పొలం వద్దకు వెళ్లారు. అక్కడ చిరుత సంచరించడంతో భయాందోళనకు గురై గ్రామంలోకి పరుగులు తీశారు.  సర్పంచ్‌ ఆరె లతకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న   ఎఫ్‌ఎస్‌వో బాపురాజు, గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు.  చిరుత అడుగులను, పరిసరాలను పరిశీలించారు. అడుగులను గుర్తించిన ఎఫ్‌ఎస్‌వో బాపురాజు చిరుత సంచరించినట్లు నిర్ధారించారు.  అటవీ ప్రాంత గ్రామాల రైతులు,  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  పొలాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు. 

Advertisement
Advertisement