నిద్ర తగ్గితే కష్టమే!

ABN , First Publish Date - 2020-06-15T18:26:35+05:30 IST

రాత్రిళ్లు ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం ఎక్కువ కాలం కొనసాగితే పగటిపూట నిద్రమత్తు వదలదు.

నిద్ర తగ్గితే కష్టమే!

ఆంధ్రజ్యోతి(15-06--2020)

రాత్రిళ్లు ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం ఎక్కువ కాలం కొనసాగితే పగటిపూట నిద్రమత్తు వదలదు.

 రోజూ 6 గంటలు నిద్రపోతున్నారా, 10 గంటలు నిద్రపోతున్నారా అనేది సమస్య కాదు. ఆలస్యంగా పడుకుంటే జీవ గడియారం దెబ్బతింటుంది కాబట్టి వేళకు నిద్రపోవాలి.


మంచి నిద్ర పట్టాలంటే..!

కెఫిన్‌కు దూరం- సాయంత్రం 4 తరువాత టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌ తీసుకోవద్దు. 


ఆహారం- మానసికంగా ఆరోగ్యంగా   ఉంటే పేగుల పనితీరు బాగుంటుంది. శుచిగా ఉండే ఆహారమే తినాలి. 


దీర్ఘశ్వాస- పడుకునేముందు దీర్ఘశ్వాస తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గి త్వరగా నిద్రపడుతుంది.


చురుగ్గా ఉండండి- డ్యాన్స్‌, నడక, వ్యాయామం లాంటివి రోజూ 30 నిమిషాల పాటు చేయాలి. 


ఫోన్‌కు దూరం - నిద్రకు రెండు గంటల ముందుగానే ఫోను పక్కన పెట్టేయాలి, సోషల్‌ మీడియాకు దూరం ఉండాలి.

Updated Date - 2020-06-15T18:26:35+05:30 IST