Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 2 : సమాజంలో నేటి యువత హెచ్‌ఐవీ పట్ల పూర్తి అవగాహన కల్పించుకోవాలని.. తద్వారా వ్యాధిరహిత సమాజాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం మెదక్‌లో ఎయిడ్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎయిడ్స్‌ వ్యాధి చాపకింద నీరులా రోజురోజుకూ వ్యాపిస్తుందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతీ ఆరోగ్య కార్యకర్తపై ఉన్నదన్నారు. ఈ సందర్భంగా ఎయిడ్స్‌పై నిర్వహించిన క్విజ్‌ పోటీలో ప్రథమస్థానం సాధించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు రూ.5 వేల నగదు బహుమతిని అందజేశారు. ఎయిడ్స్‌ నియంత్రణలో ఉత్తమ సేవలందిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. నవీన్‌, మాధవితోపాటు ఐసీటీసీ కౌన్సిలర్లు  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement