'బిన్ ఫ్రీ కర్నూలు' గా మార్చుదాం: మేయర్ రామయ్య

ABN , First Publish Date - 2021-03-28T00:39:38+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా కర్నూల్ నగరాన్ని చెత్త రహిత నగరంగా

'బిన్ ఫ్రీ కర్నూలు' గా మార్చుదాం: మేయర్ రామయ్య

కర్నూలు:  స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా కర్నూల్ నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్ధేందుకు క‌ృషి చేద్దామని నగర మేయర్ బీవై రామయ్య పిలుపునిచ్చారు. ఈ రోజు నగరంలో 19వ వార్డులో 'బిన్ ఫ్రీ కర్నూలు' కార్యక్రమాన్ని మేయర్  రామయ్య ప్రారంభించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని వార్డుల్లో (చెత్తకుండీలను తీసివేసిన చోట) బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, చెత్త సేకరణకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి మాత్రమే చెత్తను ఇచ్చేలా ప్రజలల్లో  చైతన్యం కల్గించాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని సుందర, ఆరోగ్య  కర్నూలు నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కమిషనర్ బాలాజీ, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-28T00:39:38+05:30 IST