వర్షాకాలం వీటిని తిందాం!

ABN , First Publish Date - 2021-08-01T05:46:31+05:30 IST

ఆహారశైలి కాలానుగుణంగా మారుతూ ఉండాలి. అప్పుడే అయా కాలాల్లో పండే పంటలతో కాలానికి తగిన ఆరోగ్య రక్షణ దక్కుతుంది.

వర్షాకాలం వీటిని తిందాం!

హారశైలి కాలానుగుణంగా మారుతూ ఉండాలి. అప్పుడే అయా కాలాల్లో పండే పంటలతో కాలానికి తగిన ఆరోగ్య రక్షణ దక్కుతుంది. ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌ సూచిస్తున్న, వర్షాకాలానికి తగిన ఆహార నియమాలు ఇవి!


వారానికి రెండు, మూడుసార్లు!

తినవలసినవి: ఉడకబెట్టిన వేరుసెనగలు, ఉడికించిన/మొలకెత్తిన పప్పుధాన్యాలు, మొక్కజొన్న, సొర, దోస, గుమ్మడి, ఇతర పాకే కూరగాయలు, కంద/చేమ దుంపలు

వంటకం: చామ దుంప వంటకం... అర్బి కా చాప్‌. తగినన్ని నీళ్లు పోసి దుంపలను కుక్కర్‌లో నాలుగు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించుకుని, తోలు తీసి, ముక్కలుగా తరుక్కోవాలి. కారం, పసుపు కలిపి 10 నిమిషాలు పక్కనుంచాలి. ఉప్పు కలిపి వేయించాలి.


వారానికి ఒకసారి!

తినవలసినవి: చిరుధాన్యాలు. వీటిలో బక్‌వీట్‌, తోటకూర విత్తనాలు తినాలి. అలాగే ఈ కాలంలో విరివిగా పడే బంగాళాదుంపలు, గోంగూర తినాలి. 

వంటకం: గోంగూర వంటకం... అంబడి చి భాజి. మరిగే నీళ్లలో తరిగిన గోంగూర వేసి ఉడికించుకోవాలి. ఈ గోంగూరకు కందిపప్పు/నానబెట్టిన వేరుసెనగలు లేదా బియ్యం/జొన్నలు కలిపి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. దీనికి పసుపు, కారం, ఇంగువ, ఆవాలతో తాలింపు వేయాలి. ఉప్పు, బెల్లం, కొబ్బరి తురుము జోడించి, కొద్దిసేపు ఉడికించి, చివర్లో ఎండు మిరపకాయలతో తాలింపు వేసుకోవాలి.


నెలకు ఒకసారి!

తినవలసినవి: ఆవిరి మీద ఉడికించే వంటకాలైన మోదక్‌, పటోలీ మొదలైనవి. వాము వేసి వండే బజ్జీలు, పకోడీలు. నేతిబీర, చుక్కకూర వంటకాలు. మష్రూమ్స్‌ కూర లేదా పచ్చడి

వంటకం: మోదక్‌ బియ్యం పిండి కలుపుకోవాలి. పూర్ణం కోసం తాజా నెయ్యి, బెల్లం, కొబ్బరి తురుము కలుపుకోవాలి. దానికి జాజికాయ, యాలకుల పొడి కలపాలి. మోదక్‌లను తయారుచేసుకుని నెయ్యి పూసిన గిన్నెల్లో వేసి, పావుగంట ఆవిరి మీద ఉడికించుకోవాలి.

Updated Date - 2021-08-01T05:46:31+05:30 IST