సమస్యల సాధనకు సంఘటితంగా పోరాడదాం: వినాయకం

ABN , First Publish Date - 2022-01-24T05:37:29+05:30 IST

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల సాధనకు సంఘటితంగా పోరాడాలని ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం పిలుపునిచ్చారు.

సమస్యల సాధనకు సంఘటితంగా పోరాడదాం: వినాయకం
సభలో ప్రసంగిస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం

పీలేరు, జనవరి 23: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల సాధనకు సంఘటితంగా పోరాడాలని ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం పిలుపునిచ్చారు. స్థానిక కోటపల్లెలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ మేరకు.. రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా నాగరాజ నాయక్‌(కడప) అధ్యక్షుడిగా కె.వినాయకం(చిత్తూరు), ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్‌(నెల్లూరు), ఆర్థిక విభాగ కార్యదర్శిగా ఎన్‌.భానుప్రకాష్‌(గుంటూరు), అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఉప్పు మోహన్‌(చిత్తూరు), అదనపు కార్యదర్శిగా వెంకటేష్‌(అనంతపురం), ఉపాధ్యక్షులుగా స్వతంత్రబాబు(కడప), ప్రభావతి(తూర్పుగోదావరి), ప్రతాప్‌(పశ్చిమగోదావరి), వెంకటేష్‌(కృష్ణ), స్వాతి(గుంటూరు), శ్రీనివాసులు(చిత్తూరు), శ్యామ్‌(విజయనగరం), కార్యదర్శులుగా ఉమామహేశ్వరరావు(విజయనగరం), చందు నాయక్‌(కర్నూలు), ప్రభుదాస్‌(ప్రకాశం), రామాంజనేయులు(విశాఖపట్నం), పురుషోత్తం(చిత్తూరు), సురేష్‌ (కడప), శ్రీకాంత్‌(గుంటూరు) ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రవికుమార్‌, లక్ష్మీనారాయణ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:37:29+05:30 IST