బతుకు తెలంగాణ కోసం ఉద్యమిద్దాం

ABN , First Publish Date - 2021-01-16T05:22:18+05:30 IST

బతుకు తెలంగాణ కోసం ఉద్యమిద్దామని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ పిలుపునిచ్చారు.

బతుకు తెలంగాణ కోసం ఉద్యమిద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న చెరుకు సుధాకర్‌

తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ 

శాలిగౌరారం, జనవరి15: బతుకు తెలంగాణ కోసం ఉద్యమిద్దామని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో శుక్రవారం జరి గిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఊహల పల్లకిలో ఊగిస లాడే బంగారు తెలంగాణ కాదు భరోసాతో బతకగలిగే బతుకు తెలంగాణ  కోసం ఉద్యమిద్దామన్నారు. ప్రశ్నించే గొంతుకలను భిన్న రూపాల్లో తెలంగాణ ప్రభుత్వం అణిచివేతలు, నిర్భందాలకు గురి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతానన్నారు. మండలిలో  ప్రశ్నించే గొంతుకనవుతానన్నారు. సమావేశంలో తెలంగాణ ఇంటి పార్టీ నా యకులు దేవరకొండ మస్తాన్‌, యానాల నర్సింహ్మారెడ్డి, సామాజిక కార్య కర్తలు పల్స యాదగిరి, పందుల సైదులు, పడాల అంతయ్య, కొయ్యడ శివ శంకర్‌, దొనకొండ అంజయ్య, సునీత, సతీష్‌, ఎస్‌కె.చాంద్‌పాషా పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T05:22:18+05:30 IST