ఇళ్ల నిర్మాణాలపై అలసత్వం వీడండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-06-15T06:12:45+05:30 IST

వరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అర్హులకు మంజూరైన ఇళ్ల నిర్మాణాల్లో అలసత్వం వీడి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అధికారులకు సూచించారు.

ఇళ్ల నిర్మాణాలపై అలసత్వం  వీడండి: కలెక్టర్‌
హౌసింగ్‌ అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 14: నవరత్నాలు- పేదలందరికీ   ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అర్హులకు మంజూరైన ఇళ్ల నిర్మాణాల్లో అలసత్వం  వీడి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్లో గృహ నిర్మాణాలకు సంబంధించి మ్యాపింగ్‌, జియో ట్యాగింగ్‌, రిజిస్ర్టేషన్‌, గ్రౌడింగ్‌ తదితర అంశాలపై హౌసింగ్‌ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందరంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేటట్లు అవగాహన కల్పించాలని, అవసరమైన వారికి ఇసుక తరలింపునకు కూపన్లను మంజూరు చేయాలని సూచించారు. హౌసింగ్‌ జేసీ ఎస్‌. వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1.74 లక్షల ఇళ్లు మంజూరు కాగా 86 శాతం మ్యాపింగ్‌, 54 శాతం జియో ట్యాగింగ్‌, 66 శాతం రిజిస్ర్టేషన్లు పూర్తయన్నారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ  పద్మనాభం, డీఈ, ఈఈలు పాల్గొన్నారు. అంతకు ముందుజరిగిన ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనుల ప్రగతిపై జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పథకం కింద చేపట్టిన పనుల్లో కచ్చిత పురోగతి ఉండాలన్నారు. నిర్మాణాల్లో ఉన్న సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి  తీసుకురావాలన్నారు. సమావేశంలో జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీహరి, వ్యవసాయశాఖ జేడీ దొరసాని, 108, 104 నోడల్‌ ఆఫీసర్‌ లోకవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.






Updated Date - 2021-06-15T06:12:45+05:30 IST