గుడ్లగూబను తయారుచేద్దామా!

ABN , First Publish Date - 2021-09-13T05:30:00+05:30 IST

ఒక పేపర్‌ ప్లేట్‌ పైభాగంలో సగానికి పైగా ముందుకు మడవండి. తరువాత బొమ్మలో చూపించినట్టుగా రెండు వైపులా కత్తిరించండి. ఇప్పుడు కత్తిరించిన భాగానికి అటూ ఇటూ ఉన్న భాగాన్ని పైకి మడవండి. ఇవి గుడ్లగూబ చెవులు.

గుడ్లగూబను తయారుచేద్దామా!

కావలసినవి

పేపర్‌ ప్లేట్లు, దళసరి కాగితం, కత్తెర, జిగురు, స్కెచ్‌ పెన్నులు

ఇలా చేయాలి...

ఒక పేపర్‌ ప్లేట్‌ పైభాగంలో సగానికి పైగా ముందుకు మడవండి. తరువాత బొమ్మలో చూపించినట్టుగా రెండు వైపులా కత్తిరించండి.

 ఇప్పుడు కత్తిరించిన భాగానికి అటూ ఇటూ ఉన్న భాగాన్ని పైకి మడవండి. ఇవి గుడ్లగూబ చెవులు. 

 మడిచి ఉన్న మధ్య భాగంపై స్కెచ్‌ సహాయంతో కళ్లు గీయాలి. 

 మరొక పేపర్‌ ప్లేట్‌ను గుడ్ల గూబ తల వెనుక అతికించాలి.

 ఇంకొక పేపర్‌ ప్లేట్‌ను సగానికి కత్తిరించి బొమ్మలో చూపించినట్లు రెక్కల్లా అతికించాలి.

 తరువాత రంగులు వేయాలి. చిన్న కాగితాన్ని ముక్కులా కత్తిరించి అతికిస్తే గుడ్లగూబ బొమ్మరెడీ. 

Updated Date - 2021-09-13T05:30:00+05:30 IST