వీడిన హత్య కేసు మిస్టరీ

ABN , First Publish Date - 2022-01-21T06:04:33+05:30 IST

మండలంలోని యామపూర్‌ గ్రామంలో గత గురువారం గ్రామానికి చెందిన చెదలు రాజేందర్‌ను హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

వీడిన హత్య కేసు మిస్టరీ
అరెస్టు చూపుతున్న మెట్‌పల్లి సిఐ శ్రీను

ప్రాణం తీసిన భూ తగాదా

ముగ్గురు నిందితుల రిమాండ్‌

వివరాలు వెల్లడించిన మెట్‌పల్లి సీఐ

ఇబ్రహీంపట్నం, జనవరి 20: మండలంలోని యామపూర్‌ గ్రామంలో గత గురువారం గ్రామానికి చెందిన చెదలు రాజేందర్‌ను హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు.  గురువారం మెట్‌పల్లి సీఐ శ్రీ ను విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సం దర్భంగా సీఐ మాట్లాడుతూ యామపూర్‌ గ్రామానికి చెందిన మృతుడు చెదలు రాజేందర్‌కు నిందితుడు కాస సంజీవ్‌కు మూడేళ్లుగా భూ వి వాదం నడుస్తోంది. సంజీవ్‌కు చెందిన 3 ఎకారల భూమిని మృతుడు రాజేందర్‌ సొంతం చేసుకోవాలని చూడగా తరచూ ఇద్దరి మధ్య గొడ వలు జరిగాయి. అదే కాకుండ నిందితుడు సంజీవ్‌కు మరో చోట 4 ఎక రాల భూమి ఉండగా ఆ విషయంలోనూ రాజేంధర్‌ సంజీవ్‌తో పలు మార్లు గొడవ పడ్డారు. ఈ విషయం మనసులో పెట్టుకున్న సంజీవ్‌ రాజేందర్‌ను ఎలాగైన అంతమొందించాలని ప్రణాళిక రచించాడు. తన స్నేహితుడైన గోధుర్‌ గ్రామానికి చెందిన తడిపల్లి రజనీకాంత్‌ను పిలి పించి  రెక్కీ నిర్వహించి సంజీవ్‌ తన ఇంటి నుంచి 2 కత్తులను, తీసు కోని వెళ్లి రాజేంధర్‌ పొలం వద్ద ఉండటం చూసి అక్కడకు వెళ్లి కంట్లొ కారం చల్లి కత్తులతో పొడిచి హత్య చేసి పరిపోయారు. హత్య అనం తరం నిందితులు రాయికల్‌ మండలం భూపతిపూర్‌లోని తన బంధువు మంగళరపు లక్ష్మీనారయణ ఇంటికి వెళ్లి సాక్షులు లేకుండా ఉండేందుకు  అక్కడ బట్టలు, ఇతర సామగ్రిని కాల్చి వేసారు. హత్యకు సంబంధిం చి న 2 కత్తులను, పల్సర్‌ బండిని, నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చే సుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు సంజీవ్‌ను, తడిపల్లి రజనీకాం త్‌లను ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్‌కొండపూర్‌ గ్రామ శివారులో గురువారం పట్టుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి మెట్‌పల్లి కోర్టులో హాజరు పరిచి కరీంనగర్‌ జైలుకు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఉమా సాగర్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.


Updated Date - 2022-01-21T06:04:33+05:30 IST