Abn logo
Feb 24 2021 @ 00:03AM

‘స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం’

తెర్లాం, ఫిబ్రవరి 23: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మిక, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు పోరాటానికి సిద్ధమవ్వాలని సీఐటీ యూ జిల్లా నాయకులు ఎస్‌.గోపాలం పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఓ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ  స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనుకోవడం దారుణమన్నారు. దీనికి నిరసన గా ఈనెల 26న ర్యాలీ, రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు చెప్పారు. డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు సురేష్‌ మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంలో విద్యార్థులు, యువజనులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు చంద్రావతి, రామారావు, విద్యార్థులు, కార్మికులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement
Advertisement