బ్రాడ్‌కాస్టర్ల దోపిడీని అడ్డుకుంటాం: ట్రాయ్‌

ABN , First Publish Date - 2021-10-23T08:11:16+05:30 IST

టీవీ చానళ్ల కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ 2.0 (ఎన్‌టీవో 2.0) పేరుతో కొందరు బ్రాడ్‌కాస్టర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భారత టెలికాం ....

బ్రాడ్‌కాస్టర్ల దోపిడీని అడ్డుకుంటాం: ట్రాయ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 22: టీవీ చానళ్ల కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ 2.0 (ఎన్‌టీవో 2.0) పేరుతో కొందరు బ్రాడ్‌కాస్టర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘బోకే ప్యాకేజీపై ఓ బ్రాడ్‌కాస్టర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సాధారణ వినోద చానల్‌(జీఈసీ) లేదా స్పోర్ట్స్‌ చానల్‌ను సబ్‌స్ర్కైబ్‌ చేస్తే.. రూ. 100 అదనపు చార్జీలు రద్దవుతాయంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. అది అవాస్తవం’’ అని ట్రాయ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్‌టీవో 2.0లో కేవలం బొకే(అ-ల-కార్ట్‌) పద్ధతిలో ధరలను సవరించుకునే వెసులుబాటును మాత్రమే బ్రాడ్‌కాస్టర్లకు ఇచ్చామని వివరించింది. ట్రాయ్‌ నిఘా నిరంతరం కొనసాగుతుందని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Updated Date - 2021-10-23T08:11:16+05:30 IST