పట్టణాన్ని పచ్చదనంతో నింపేద్దాం

ABN , First Publish Date - 2020-07-08T10:52:03+05:30 IST

పట్టణాన్ని పచ్చదనంతో నింపివేయాలని షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌ పిలుపునిచ్చారు.

పట్టణాన్ని పచ్చదనంతో నింపేద్దాం

షాద్‌నగర్‌/కడ్తాల్‌/మేడ్చల్‌/ఘట్‌కేసర్‌/ఇబ్రహీంపట్నం: పట్టణాన్ని పచ్చదనంతో నింపివేయాలని షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌ పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా 20, 21 వార్డుల్లో ఆయన కౌన్సిలర్లు మహేశ్వరి, శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రత్యేకా ధికారులు వెంకటేష్‌, మల్లేష్‌, రహమాన్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల్‌ మండలంలోని కడ్తాల, మక్తమాదారం, రావిచెడ్‌ గ్రామాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌, ఎంపీపీ కమ్లీ మోత్యనాయక్‌, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటేశ్‌, మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ వీరయ్య, సర్పంచ్‌ లక్ష్మినర్సింహారెడ్డి ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


మేడ్చల్‌ మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో కేవీ.రెడ్డినగర్‌లో చైర్‌పర్సన్‌ లక్ష్మి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌, నాయకులు మహేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని 11వ వార్డు కౌన్సిలర్‌ మల్లేశ్‌ ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీ పరిధిలో 3,4,5 వార్డుల్లో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, వైస్‌ చైర్మన్‌ యాదగిరి కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంద సుధాకర్‌, జగన్‌,  సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T10:52:03+05:30 IST