Abn logo
Oct 23 2021 @ 00:44AM

మార్కెట్‌ జోలికి వస్తే చూస్తూ ఊరుకోం..

వ్యాపారులతో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

-వ్యాపారులకు అండగా నిలుస్తాం..

-నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పరిటాలర శీరామ్‌

- అధికారుల తీరుపై మండిపాటు

ధర్మవరం, అక్టోబరు 22: పేదలకు జీవనాధారమైన కూరగాయల మార్కెట్‌ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని అక్కడున్న కాంప్లెక్స్‌లను మున్సిపల్‌ అధికారులు తొలగింపుకు చర్యలు చేపట్టారు. అయితే ఈ తొల గింపును వ్యాపారులు, అఖిలపక్షం నాయకులు అడ్డుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పరిటాలశ్రీరామ్‌, టీడీపీనాయకులు, సీపీఎం నా యకులు పోలా రామాం జినేయులు, జంగాలపల్లిపెద్దన్న, సీపీఐ నాయ కులు జింకాచలపతి, మధులతో కలిసి మార్కెట్‌ను సందర్శించగా అక్కడున్న వ్యాపారులు వారిగోడును వెల్లబోసుకున్నారు. తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడకూరగాయల వ్యాపారాలు చేసుకుంటూ కుటుం బాలను పోషించుకుంటున్నామని, మార్కెట్‌ అభివృద్ధి పేరుతో కాం ప్లెక్స్‌లను అధికారులు తొలగిస్తున్నారన్నారు. మార్కెట్‌ను నూత నం గా కాంప్లెక్స్‌ నిర్మాణం చేస్తున్నామని, మీరంత ఖాళీ చేయాలని నిర్మాణం పూర్తి అయ్యేవరకు బీఎస్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఉన్న శ్మశాన వాటిక వద్ద మార్కెట్‌ను నిర్వహించుకోవాలని అధికా రులు సూచించారన్నారు. ప్రాణాలు పోయిన మార్కెట్‌ను వదలమని తమకు న్యా యం చేయాలని శ్రీరామ్‌ను వ్యాపారులు కోరారు. అందుకు మార్కెట్‌జోలికి వస్తే చూస్తు ఊరుకోమని టీడీపీతోపాటు సీపీఎం, సీపీఐ అండగా నిలిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...మార్కెట్‌లో వ్యాపారులు ఖాళీ చేయాలని మున్సిపల్‌ అధికారులు కాంప్లెక్స్‌ను తొలగించారు. షెడ్లలో వ్యాపా రులు ఉన్నా కూల్చడానికి ప్రయత్నించారన్నారు. సినిమాలో చూస్తున్నట్టుగా పోలీసు లు కూరగాయలను రోడ్లపైకి పారవేసి రౌడీల్లా వ్యవహరించడం బాధాకరమన్నారు. వ్యాపారులు తమ గోడును వెల్లబోసు కోవడానికి వెళ్లితే కమిషనర్‌  దురుసుగా మా ట్లాడటం సరికాదన్నారు. అధికారులు, పోలీసులు దిగజారి విఽధులు నిర్వ ర్తిస్తున్నా రన్నారు. ప్రభుత్వనిఽధులతో కాంప్లెక్స్‌ నిర్మాణాలు చేపట్టి బాడుగకు ఇవ్వాలని డిమాం డ్‌ చేశారు. అధికారులు వ్యాపారులతో చర్చించి వారికి న్యాయం చేయాలన్నారు.  ఎమ్మెల్యే గుడ్‌మార్నింగ్‌ నిర్వహించి మార్కెట్‌లోని వ్యాపారస్థుల సమస్యలు విని వారి అనుకూలం మేరకు న్యాయం చేయాలేకానీ నీ చెంచాల మెప్పుకోసం ప్రవర్తిం చవద్దని హితవు పలికారు. అలాకాదని మార్కెట్‌ను కూలగొట్టి కాంప్లెక్స్‌ నిర్మిస్తా మంటే తాము అడ్డుకుం టామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకు లు కమ తంకాటమయ్య, పురుషోత్తంగౌడ్‌, ముత్యాలప్ప నాయుడు, మేకల రామాం జినేయులు, మహేశ్‌చౌదరి, చింతపులుసు పెద్దన్న, పోతు కుంటలక్ష్మన్న, భీమనేని ప్రసాద్‌నాయుడు, అంబటిసనత్‌ కుమార్‌, చిగిచెర్ల రాఘవరెడ్డి, పరిశేసుఽధాకర్‌, జమీర్‌ అహమ్మద్‌, చీమల రామాంజి, బాబూఖాన్‌, చిన్నూరువిజయ్‌,గంగారపురవి, పల్లపు రవి, సాకేకుళ్లాయప్ప, పోతుకుంటరవి, రమేశ్‌, సాకేశివయ్య, చికెన్‌ రాము, కిరోసిన్‌ పోతలయ్య, చీమలమహేశ్‌, ఇర్షాద్‌, తోటవాసుదేవ, అశోక్‌, బోడగల ప్రభా కర్‌ తదితరులు పాల్గొన్నారు.