‘ఇంటి వద్దకే రేషన’కు రాంరాం!

ABN , First Publish Date - 2021-05-16T06:05:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఇంటి వద్దకే రేషన పంపిణీ కార్యక్రమం ఆరంభ శూరత్వంగా తయారైంది. కొద్ది నెలల్లోనే అటకెక్కింది.

‘ఇంటి వద్దకే రేషన’కు రాంరాం!
రేషన కోసం వేచి ఉన్న లబ్ధిదారులు (ఫైల్‌ ఫొటో)

మూలనపడుతున్న ఎండీయూ వాహనాలు

ఆరంభ శూరత్వంగా మారిన పంపిణీ కార్యక్రమం

వీధి చివరన వాహనాల వద్ద తప్పని పడిగాపులు

ఇబ్బందులు పడుతున్న కార్డుదారులు


ఉరవకొండ, మే 15: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఇంటి వద్దకే రేషన పంపిణీ కార్యక్రమం ఆరంభ శూరత్వంగా తయారైంది. కొద్ది నెలల్లోనే అటకెక్కింది. ఆపరేటర్లు ఇంటింటికి వెళ్లకుండా వాహనాన్ని ఒక వీధిలో ఉంచి లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల సర్వర్లు పనిచేయకుండా కార్డు లబ్ధిదారులు ట్రక్కుల వద్దే రేషన కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. పనులు మానుకొని ట్రక్కుల వ ద్ద పడిగాపులు కాసినా సరుకులు ఇస్తారన్న గ్యారెంటీ లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కరోనా విజృంభిస్తుండడంతో మినీ ట్రక్కు ఆపరేటర్లు సరుకులను పంపిణీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. రేషన పంపిణీ ప్రా రంభమై 15 రోజులవుతున్నా వీధుల్లోకి ట్రక్కులు వచ్చినా దాఖలాలేవు. దీంతో లబ్ధిదారులు ట్రక్కు వద్దకు వెళ్లాలో, రేషనషాపు వద్దకు వెళ్లాలో తె లియక అయోమయానికి గురవుతున్నారు. కొత్త విధానంలో అనేక సమస్య లు ఎదురవుతుండడంతో పాత పద్ధతే బాగుందని లబ్ధిదారులు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. 


పంపిణీ చేసింది 60 శాతం మంది లబ్ధిదారులకే.. 

మండలంలో 64 చౌకధాన్యపు డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 22,650 మంది కార్డు లబ్ధిదారులు ఉన్నారు. వారికి రేషన అందించేందుకు 13 మినీ ట్రక్కులను ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటికే 4 మినీ ట్రక్కుల ఆపరేటర్లు రాజీనామా చేయగా, 9 మినీ ట్రక్కులతో నెట్టుకొస్తున్నారు. ఆపరేటర్లు ఇం టి వద్దకే వెళ్లి రేషన పంపిణీ చేయాల్సి ఉండగా, వాహనాన్ని వీధి చివరన ఉంచి కార్డుదారులను అక్కడకు పిలిపించుకుని రేషన బియ్యం  పంపిణీ చే స్తున్నారు. ఇంటి వద్దకే రేషన విధానంలో సరుకులను పంపిణీ చేయడానికి బయోమెట్రిక్‌ అఽథెనిటిఫికేషన డీలర్లకు బదులుగా వీఆర్వో, ట్రక్కు డ్రైవర్లకు ఇస్తున్నారు. చాలా మంది ట్రక్కుడ్రైవర్లు వాహనాలు వెనక్కు ఇవ్వడంతో డీలర్ల కనుసన్నలలోనే పంపిణీ జరుగుతోంది. ట్రక్కులు వీధుల్లోకి రాక రేషనషాపులు తెరవక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని షాపులలో బియ్యం మాత్రమే వేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషనపంపిణీని సక్రమంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


రేషన పంపిణీని వేగవంతం చేస్తున్నాం:రమేష్‌, సీఎ్‌సడీటీ

రేషనపంపిణీ వేగవంతం చేస్తున్నాం. ఇప్పటిదాకా మండలంలో 60 శా తం మందికి రేషన అందించాం. ఈనెల 20వ తేదీ వరకూ రేషన దుకాణా ల్లో సరుకులు తీసుకొనవచ్చు. 

Updated Date - 2021-05-16T06:05:02+05:30 IST