Abn logo
Sep 22 2021 @ 00:43AM

పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తే ఊరుకోం

మీడియాతో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

- దాడిచేసిన వారిపై కేసు నమోదు చేయాలి: పరిటాల శ్రీరామ్‌

అనంతపురం వైద్యం సెప్టెంబరు 21: వైసీపీ నాయకులు.. పోలీసులను అ డ్డుపెట్టుకుని తమ పార్టీ శ్రేణులను అణగదొక్కే రాజకీయాలు చేస్తే ఊరుకొనేది లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యువనేత పరిటాల శ్రీరా మ్‌ హెచ్చరించారు. సోమవారం రాత్రి వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాపంపల్లికి చెందిన అంజినరెడ్డిని మంగళవారం శ్రీరామ్‌ పరామర్శించారు. అనంతరం శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ఆత్మకూరు మండలం ముట్టాలలో టీడీపీ ఎంపీటీసీ గెలుపును జీర్ణించుకోలేక అంజినరెడ్డిపై వైసీపీ గూండాలు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులు సైతం వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని చూస్తూ ఊరుకోమన్నారు. ఆయన వెంట పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.