క్రీడాకారులకు చేయూతనివ్వాలి

ABN , First Publish Date - 2021-04-14T04:55:22+05:30 IST

క్రీడాకారులకు చేయూతనివ్వాలి

క్రీడాకారులకు చేయూతనివ్వాలి
లోయపల్లిలో వాలీబాల్‌ టోర్నీ ప్రారంభిస్తున్న జడ్పీటీసీ

కడ్తాల్‌/మంచాల: క్రీడాకారులకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని మండల కాంగ్రెస్‌ అధ్యక్షు డు యాట నర్సింహ కోరారు. మక్తమాదారంలో మ ంగళవారం ‘నేను సైతం యూత్‌’ ఆధ్వర్యంలో వాలీబాల్‌ టోర్నీ నిర్వహించారు. బహుమతి ప్రదానోత్సవంలో నర్సింహ్మ విన్నర్‌కు రూ.3వేలు, రన్నర్స్‌కు రూ.1500, షీల్డ్‌లు అందజేశారు. గ్రామ నాయకులు, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంచాల జడ్పీటీసీ మ ర్రి నిత్యనిరంజన్‌రెడ్డి అన్నారు. నిరంజన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఎన్‌ఆర్‌ యువసేన అధ్వర్యంలో లోయపల్లిలో వాలీబాల్‌ టోర్నీని నిర్వహించారు. జడ్పీటీసీ క్రీడాపోటీలను ప్రారంభించారు. వైస్‌ఎంపీపీ పి.రాజేశ్వరి, సర్పంచ్‌ ఎల్లంకి అనిత, ఉపసర్పంచ్‌ వెంకటేష్‌, ఎంపీటీసీ ఎడ్మ నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షుడు జానయ్య, యువసేన అఽధ్యక్షుడు టేకుల కమలాకర్‌రెడ్డి, మాజీ సర్పంచు లు మోతీరాం, శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీటీసీలు జయానందం, రాందాస్‌, నాయకులు జంగయ్య, రామచంద్రయ్య, దాసు, మహేంద ర్‌, మారయ్య, మోహన్‌నాయక్‌, ఎం.నవీన్‌, శ్రీనివా స్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

  • క్రీడలతో మానసికోల్లాసం : వైస్‌ ఎంపీపీ 

మహేశ్వరం: క్రీడలతో మానసికోల్లాసం, శారీర క ధారుడ్యానికి దోహదపడుతాయని వైస్‌ఎంపీపీ సునీతాఅంద్యానాయక్‌ అన్నారు. దయ్యాలగుండుత ండాలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను సర్పంచ్‌ రాజునాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వి ద్యార్థులకు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ జగన్‌, నాయకులు రవి, గోపి, దేవ్లా, క్రీడాకారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-14T04:55:22+05:30 IST