వ్యాక్సినేషన కార్యక్రమం విజయవంతం చేద్ధాం

ABN , First Publish Date - 2021-06-20T05:44:01+05:30 IST

చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన డ్రైవ్‌ హిందూపురం మునిసిపాలిటీ పరిధిలో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన డ్రైవ్‌ను విజయవంతం చేయాలని మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్‌ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

వ్యాక్సినేషన కార్యక్రమం విజయవంతం చేద్ధాం
సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌

హిందూపురం టౌన, జూన 19: చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన డ్రైవ్‌ హిందూపురం మునిసిపాలిటీ పరిధిలో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన డ్రైవ్‌ను విజయవంతం చేయాలని మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్‌ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం మునిసిపల్‌ కార్యాలయంలో అంగనవాడీ, ఆశ కార్యకర్తలు, ఎఎనఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 43 సచివాలయాల పరిధిలో 4 ఆరోగ్య ఉపకేంద్రాలు ఆదివారం టీకా స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నామని దీనిని విజయవంతం చేద్దామన్నారు. ఇప్పటికే 27 వేల మందికి టీకా వేయడం జరిగిందన్నారు. ఆదివారం ఒక్కరోజూ 3,400 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఫ్రంట్‌లైన వారియర్స్‌ పారిశుధ్య కార్మికులు, పోలీసు, రెవన్యూ, మీడియా, తదితర విభాగాల్లో పనిచేస్తున్న వారికి వ్యాక్సిన వేయాలన్నారు. ఉదయం 7.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు  వ్యాక్సిన వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ నాగమల్లీశ్వరి, డాక్టర్‌ ఆనంద్‌బాబు, పద్మజ, సిబ్బంది హరిదాస్‌, సుబ్బరాయుడు, రమాదేవి, శానిటరీ ఇనస్పెక్టర్‌ సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-20T05:44:01+05:30 IST