రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం

ABN , First Publish Date - 2021-03-06T06:12:22+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీలో రైతులు ఉద్యమిస్తున్న స్ఫూర్తిని ఆద ర్శంగా తీసుకుందామని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర అధ్య క్షుడు కోటేశ్వర్‌రావు, రాష్ట్ర నేత జనార్దన్‌ అన్నారు.

రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం
మిర్యాలగూడ మండలం బోట్యానాయక్‌తండాలో నాగలి ఎత్తిన జూలకంటి

ఎన్‌డీ నేతలు కోటేశ్వర్‌రావు, జనార్ధన్‌

నకిరేకల్‌, మార్చి 5: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీలో రైతులు ఉద్యమిస్తున్న స్ఫూర్తిని ఆద ర్శంగా తీసుకుందామని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర అధ్య క్షుడు కోటేశ్వర్‌రావు, రాష్ట్ర నేత జనార్దన్‌ అన్నారు.  రైతుల ఉద్యమం 100 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నకిరేకల్‌లో ఓ ఫంక్షన్‌హాల్‌లోని  సీపీఐ(ఎంఎల్‌), న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పోరు గర్జన సభ లో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌కు తాకట్టు పెడుతోందని విమర్శించారు. సీపీఐ(ఎంఎల్‌), న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో డేవిడ్‌ కుమార్‌, సాగర్‌, గంట నాగయ్య, బొడ్డు శంకర్‌, సత్యం, సిలివేరు జానయ్య, నగేష్‌  పాల్గొన్నారు. ఈ సందర్భంగా యానాల మల్లారెడ్డి స్మారక భవనం నుంచి పట్టణంలోని మొయిన్‌ సెంటర్‌కు భారీ నిర్వహించిన భారీ ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది.  


సీపీఎం ఆధ్వర్యంలో మానవహారం

మిర్యాలగూడ :  రైతు వ్యతిరేక సాగు చట్టాలను రద్దు చేసి వ్యవసాయాన్ని కాపాడాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ మండల పరిధిలోని బోట్యానాయక్‌ తండాలో సాగు చట్టాల రద్దు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో మానవహరం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి నాగలి భుజాన మోస్తూ నిరసన తెలిపారు.  రైతు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే 5 లక్షల ట్రాక్టర్‌లతో ఢిల్లీని ముట్టడిస్తామని తెలిపారు. కార్యక్రమంలో  రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా నాయకులు నూకల జగధీశ్‌ చంద్ర, మల్లు గౌతంరెడ్డి, రవినాయక్‌, సర్పంచ్‌ సువాలి బాలాజీ, ౅సైౖదులు, శ్రీనివాస్‌, గోపి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T06:12:22+05:30 IST