Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడుద్దాం

అంబేడ్కర్‌ విగ్రహానికి పూలు పోస్తున్న మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, చిత్రంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవర్‌

- రాష్ట్ర అబ్కారీశాఖ మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌

-   బాబా సాహెబ్‌ విగ్రహానికి నివాళి 

 పాలమూరు, డిసెంబరు 6: అంబేడ్కర్‌ ఆశయా లకు అనుగుణంగా ఆయన దారిలోనే అందరం నడు ద్దామని రాష్ట్ర అబ్కారీశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. బాబా సాహెబ్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ దగ్గర ఉన్న విగ్రహానికి కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, ఎస్పీ ఆర్‌.వెంకటే శ్వర్లు, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవర్‌తో కలి సి మంత్రి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ చిన్నరాష్ట్రాలు ఏ ర్పడితేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాన్ని గుర్తుచేశా రు.   ఏడేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నా రు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నరసిం హులు, వైస్‌ చైర్మన్‌ టి.గణేష్‌, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, తిరుపతిరెడ్డి, యాదయ్య, ఇందిరచత్రు, ఆర్డీవో పద్మశ్రీ, కమిషనర్‌ ప్రదీప్‌కుమా ర్‌  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement