Advertisement
Advertisement
Abn logo
Advertisement

అభివృద్ధికి ఐక్యంగా ముందుకు సాగుదాం

కడ్తాల్‌: అభివృద్ది కార్యక్రమాల విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని కడ్తాల అఖిలపక్ష సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు అభిప్రాయపడ్డారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం కడ్తాల గ్రామాభివృద్ధి, మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం గురించి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్థలాల కేటాయింపు, భవనాల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. త్వరలో అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు తీర్మానించారు. నూతనంగా ఏర్పడ్డ కడ్తాల మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి అనువైన స్థలాల కేటాయింపునకు కలిసికట్టుగా ముందుకు సాగాలని అఖిలపక్షనాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజలకు అనువైన స్థలాల్లో అందరికీ ఆమోదయోగ్యంగా భవనాల నిర్మాణాలను చేపట్టాలన్నారు. మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు భవనాల నిర్మాణం దిశగా ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. గ్రామాభివృద్ది సమన్వయ కర్త కె.చందోజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌, ఎంపీటీసీల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, కడారి రామకృష్ణ, గంప వెంకటేశ్‌  తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement