Abn logo
May 24 2020 @ 04:46AM

రైతులకు మెరుగైన సేవలు అందిద్దాం

ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి


తిమ్మాజిపేట, మే 23: రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధులు కలిసి కట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తిమ్మాజిపేటలోని సింగిల్‌విండో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.  తమ సొసైటీ తరపున రైతులకు కావలిసిన పంటరుణాలు, గోల్డ్‌ లోన్‌, చిరు వ్యాపారాలకు రుణాలు ఇస్తామని చైర్మన్‌ డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి అన్నారు.


ఈనెల 10న ఎమ్మెల్యే చేతుల మీదుగా రుణాలు ఇస్తామన్నారు.  ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జడ్పీటీసీ దయాకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శ్రీనివాసులు, రైతుమండల కోఆర్డినేటర్‌ వెంకటస్వామి, ఆయా మండలాల పీఏసీఎస్‌ చైర్మన్లు, స్థానిక సర్పంచ్‌ వేణుగోపాల్‌గౌడ్‌, ఎంపీటీసీ లీలావతి, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement