Advertisement
Advertisement
Abn logo
Advertisement

జ్యోతిరావుపూలే అడుగుజాడల్లో నడుద్దాం

పలువురు ఘన నివాళి

కడప(ఎర్రముక్కపల్లె/నాగరాజుపేట/కలెక్టరేట్‌/ మారుతీనగర్‌/), నవంబరు 28: భారతదేశంలో మహిళల విద్య కోసం పాటుపడిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని, ఆయన అడుగు జాడల్లో అందరూ నడవాలని ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అంజద్‌బాషా పిలుపునిచ్చారు. నగరంలోని పాతబస్టాండ్‌ సర్కిల్‌లో ఆదివారం పూలే 131వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి అంజద్‌బాషా, నగర మేయర్‌ సురే్‌షబాబు, పలువురు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే వైసీపీ జిల్లా కార్యాలయంలోనూ పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసపీ బీసీ విభాగ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జిలు, బీసీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. 


పూలే... ఆదర్శప్రాయుడు

జ్యోతిరావు పూలే ఆదర్శప్రాయుడని బీసీ మహాసభ జాతీయ కన్వీనర్‌ అవ్వారు మల్లికార్జున కొనియాడారు. ఆదివారం స్థానిక పాతబస్టాండు పూలే సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆ మహాసభ జిల్లా కన్వీనర్‌ రమణయ్య, కడప అసెంబ్లీ కన్వీనర్‌ ఎరికలయ్య, నాయకులు రామయ్య, ప్రసాద్‌ పాల్గొన్నారు.


తొలి సామాజిక విప్లవకారుడు పూలే

సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన భారతదేశ తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు కొనియాడారు. పూలే వర్ధంతిని పురస్కరించుకొని సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నాగయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పాతబస్టాండు వద్దనున్న పూలే విగ్రహానికి నివాళి అర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తల లింగమూర్తి, గోవిందు నాగరాజు, మధుసూధనరావు, తదితరులు పాల్గొన్నారు. 


పూలే జీవితం స్ఫూర్తిదాయకం

భారతదేశ మొదట సాంఘిక విప్లవ పితా మహుడు, సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసిన యోధుడు మహాత్మా జ్యోతి రావు పూలే నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేశు అన్నారు. పూలే 131వ వర్ధంతి సందర్భంగా పాత బస్టాండ్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


నేటి సమాజానికి ఆదర్శం

మహాత్మా జ్యోతిరావుపూలే జీవితం నేటి సమాజానికి ఆదర్శమని బీసీ వెల్ఫేర్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ అధికారి డాక్టర్‌ హనుమంతు వెంకటసుబ్బయ్య కొనియాడారు. పూలే 131వ వర్ధంతి సందర్భంగా బీసీ వెల్ఫేర్‌ కార్యాలయంలో పూలే చిత్రపటానికి, పాతబస్టాండ్‌లోని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఫరీద్‌ సాహెబ్‌ కూడా నివాళులర్పించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ ఆంజనేయులు, సీనియర్‌ అసిస్టెంట్‌ లోకేష్‌, హెచ్‌డబ్ల్యుఓలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement