ఈ డైట్‌తో కరోనాను అడ్డుకుందాం!

ABN , First Publish Date - 2020-09-17T05:30:00+05:30 IST

ఎలాంటి జలుబుకైనా బలవర్ధకమైన ఆహారం అవసరం. అలాగే కరోనా నియంత్రణకు కూడా రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఎంతో ముఖ్యం...

ఈ డైట్‌తో కరోనాను అడ్డుకుందాం!

ఎలాంటి జలుబుకైనా బలవర్ధకమైన ఆహారం అవసరం. అలాగే కరోనా నియంత్రణకు కూడా రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఎంతో ముఖ్యం. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు తోడ్పడే ఫుడ్స్‌ కొన్ని ఉన్నాయి. వీటితో కరోనా బారిన పడకుండా ఉండవచ్చు అంటున్నారు ఆహారనిపుణులు.  

  • నిత్యం బలవర్థకమైన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. అల్పాహారంలో నిమ్మజాతికి చెందిన కమలాపండు, నిమ్మ, ద్రాక్షపండ్లు తప్పనిసరిగా ఉండాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచడమే కాకుండా కేన్సర్‌ను సైతం అడ్డుకుంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి.  

  • బొప్పాయి చర్మానికి ఎంతో మంచిది. ఇందులోని ఫొటో న్యూట్రియంట్స్‌, యాంటీ ఆక్సిండెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.  
  • పచ్చి బొప్పాయి ముక్కలు తింటే బ్లడ్‌ షుగర్‌, కొలెస్ట్రాల్‌ నిలకడగా ఉంటుంది. బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  

  • గ్రీన్‌ టీ. పొద్దున్నే తాగితే ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. రోగనిరోధక శక్తిపెరుగుతుంది. ఇందులోని యాటీ ఆక్సిడెంట్స్‌ బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలను నియంత్రణలో ఉంచుతాయి. గ్రీన్‌ టీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని విషపదార్థాల తొలగింపు ప్రక్రియకు ఇది తోడ్పడుతుంది.  

  • పెరుగులో ప్రొటీన్లు అధికం. అలాగే రోగనిరోధక శక్తి పెంపుదలలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాదు ఇందులో విటమిన్‌-డి పుష్కలంగా ఉంటుంది. ప్రొబయాటిక్‌ గుణాలున్న పెరుగు జలుబును నియంత్రించడంలో సహాయపడుతుంది. 

  • బాదం, పల్లీలు, ఖర్జూరాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, నేరేడు పండ్లలో జింక్‌, మెగ్నీషియం, ఒమేగా-3, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. 

  • పసుపు, వేపాకులు, వెల్లుల్లి, పాలకూర, అల్లం, బ్రొకోలి, క్యారెట్‌, ఓట్‌మీల్‌, తేనె వంటివి ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శ క్తిని పెంచుకోవచ్చు.

Updated Date - 2020-09-17T05:30:00+05:30 IST