ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యలపై పోరాడతాం

ABN , First Publish Date - 2021-08-04T06:16:18+05:30 IST

జీవిత బీమా ఏజెంట్ల దీర్ఘకాలిక సమస్యలపై పోరాటం చేస్తామని ఆలిండియా ఏజెంట్ల సంఘం జనరల్‌ సెక్రటరీ ఎన్‌.గజపతిరాజు అన్నారు.

ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యలపై పోరాడతాం
సమావేశంలో మాట్లాడుతున్న గజపతిరాజు

ఆలిండియా ఏజెంట్ల సంఘం జనరల్‌ సెక్రటరీ గజపతిరాజు


అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 3: జీవిత బీమా ఏజెంట్ల దీర్ఘకాలిక సమస్యలపై పోరాటం చేస్తామని ఆలిండియా ఏజెంట్ల సంఘం జనరల్‌ సెక్రటరీ ఎన్‌.గజపతిరాజు అన్నారు. వీవీ రమణ రైతుభారతి కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెంట్ల సమస్యలు పరిష్కరించే విధంగా సంఘం కృషి చేస్తుందన్నారు. విశాఖ డివిజన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ తిరుమలరావు మాట్లాడుతూ, డివిజన్‌ పరిధిలోని ఏజెంట్లకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. అనకాపల్లి బ్రాంచ్‌ సంఘానికి నూతనంగా ఎన్నికైన బుద్ద శ్రీనివాసరావు సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఏజెంట్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T06:16:18+05:30 IST