మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌కు కమల్‌నాథ్ సవాల్

ABN , First Publish Date - 2021-10-04T02:29:32+05:30 IST

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ (62)కు కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ (74) సవాలు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌కు కమల్‌నాథ్ సవాల్

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ (62)కు కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ (74) సవాలు విసిరారు. శివరాజ్ సింగ్ ఇటీవల మాట్లాడుతూ.. కమల్‌నాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, చీటికిమాటికి ఢిల్లీ వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కమల్‌నాథ్.. తనకు లాంగ్ కొవిడ్ సోకిందని, కోలుకున్న తర్వాత న్యూమోనియా ఇబ్బందిపెట్టిందని అన్నారు. 


కొవిడ్ సోకిన వారిలో ఇది సహజమేనని, దీనికి చికిత్స కోసమే తాను ఢిల్లీ వెళ్లాలని కమల్‌నాథ్ తెలిపారు. తన ఆరోగ్యంపై ఎవరికైనా అనుమానాలుంటే పరుగు పందెం పెట్టుకుందామంటూ శివారాజ్‌కు సవాలు విసిరారు. కమల్‌నాథ్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారని ప్రశంసించారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని శివరాజ్ గుర్తుంచుకుంటే మేలని అన్నారు.  

Updated Date - 2021-10-04T02:29:32+05:30 IST