కరోనా బాధితులకు అండగా ఉందాం

ABN , First Publish Date - 2021-06-14T05:11:39+05:30 IST

కరోనా బాధితులకు అండగా ఉందాం

కరోనా బాధితులకు అండగా ఉందాం
ఇళ్లకు వెళ్లి నిత్యావసర సరుకులు అందజేస్తున్న యువకులు

యాచారం: కరోనా బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండి ఆదుకోవాలని చింతపట్ల గ్రామ యువకులు పిలుపునిచ్చారు. ఆదివారం యువకులు కరోనా బాధితులకు 13 రకాల నిత్యావసర సరుకులు అంద జేశారు. కరోనా పేషెంట్ల ఇళ్లకు వెళ్లి సరకులు ఇచ్చారు. దాతలు ముం దుకు వచ్చి చేయూతనివ్వాలన్నారు. పీఈటీ సాబెర్‌, శ్రీకాంత్‌, షబ్బీర్‌, రఘు, నాని, సుభాషిర్‌, శశికుమార్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

 

  • ప్రతీ గ్రామంలో యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించాలి


యాచారం మండల ప్రతి గ్రామంలో యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని ఎంపీపీ సుకన్యబాషా ప్రభుత్వాన్ని కోరారు. మేడిపల్లి, తమ్మలోనిగూడ, యాచారం, చౌదర్‌పల్లి, గున్‌గల్‌, గడ్డమల్లాయగూడ, మాల్‌ గ్రామాల్లో కరోనా నిర్ధారణ టెస్ట్‌లు చేయాలని ఎంపీపీ కోరారు. ప్రభుత్వాసుపత్రిలో రోజూ వంద మందికి యాంటిజెన్‌ పరీక్షలు చేసి మందులివ్వాలని ఆమె కోరారు.


  • మనోధైర్యంతో ముందుకు సాగాలి


కడ్తాల్‌: కరోనాతో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు దాతలు, మానవతావాదులు ముందుకు రావాలని జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ కోరారు. పాజిటివ్‌ వచ్చిన వారు మనోఽధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని సూచించారు. జడ్పీటీసీ చేపట్టిన ‘మీ కోసం.. మీ జడ్పీటీసీ’ భరోసా యాత్రలో భాగంగా మర్రిపల్లి, ముద్విన్‌లో పర్యటించారు. డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, మండల రైతు సమితి కో-ఆర్డినేటర్‌ జోగు వీరయ్య, సర్పంచ్‌ భాగమ్మలతో కలిసి బాధితులక ఇళ్లకు వెళ్లి నిత్యావసర సరుకులు, 10కిలోల సన్న బియ్యం, కోడి గుడ్డు, ఐసోలేషన్‌ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశారు. ఉపసర్పంచ్‌ నర్సింహ, వార్డు సభ్యులు, నాయకులు నర్సింహ, కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, భూషన్‌, జంగయ్య, బిక్యానాయక్‌, జగన్‌ పాల్గొన్నారు.


  • ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి


ఆమనగల్లు: కరోనాతో ఉద్యోగాలు, ఇతర ఉపాధి కోల్పోయిన పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు జల్లెల్ల శివ, పట్టణ కార్యదర్శి మల్లేశ్‌ కోరారు. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కరోనా వైద్యాన్ని  ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఆమనగల్లులో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు శివ, భరత్‌, వంశీ, శేఖర్‌, సాయి, సామల వంశీ, రోహిత్‌ పాల్గొన్నారు.


  • తలకొండపల్లిలో పండ్ల పంపిణీ


తలకొండపల్లి: మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పండ్లు, బిస్కెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి వెంకటేశ్‌నాయక్‌, నాయకులు పోతుగంటి కృష్ణ, నరేశ్‌, శ్రీకాంత్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


  • పోలీసులకు మాస్కులు, శానిటైజర్ల అందజేత


శంకర్‌పల్లి: ఏబీవీపీ విద్యార్థుల సమస్యలపైనే కాకుండా ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడూ ఆదుకుంటుందని ఏబీవీపీ శంకర్‌పల్లి నగర కార్యదర్శి హర్షవర్దన్‌ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శంకర్‌పల్లి మండల కేంద్రంలో ప్రజలు, పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్‌, రాహుల్‌, మున్నా, అనిల్‌, సంతోష్‌, తదితరులున్నారు.

Updated Date - 2021-06-14T05:11:39+05:30 IST