టీడీపీని గ్రామస్థాయినుంచి బలోపేతం చేద్దాం

ABN , First Publish Date - 2021-10-17T05:07:55+05:30 IST

టీడీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొద్దామని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.

టీడీపీని గ్రామస్థాయినుంచి బలోపేతం చేద్దాం
సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ నాయకులు

జిల్లా సమన్వయ కమిటీ


చిత్తూరు సిటీ, అక్టోబరు 16: టీడీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొద్దామని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువరు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా వుండాలని చెప్పారు. ఇప్పటినుంచే ఎన్నికల కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. అంతకుముందు ఎన్టీయార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహయాదవ్‌, తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు సిపాయి సుబ్రహ్మణ్యం, ఇనుకొండ సుబ్రహ్మణ్యం, పర్వీన్‌ తాజ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌, రాష్ట్ర కార్యదర్శులు సందీప్‌, సురేంద్రకుమార్‌, బుల్లెట్‌ రమణ, విజయలక్ష్మి, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌వర్మ, నియోజకవర్గ ఇన్‌చార్జులు గాలి భానుప్రకాష్‌, సుధాకరరెడ్డి, రమేష్‌, జేడీ రాజశేఖర్‌, చిట్టిబాబు, ఎన్‌పీ జయప్రకాష్‌, వసంత్‌కుమార్‌, నాయకులు కోదండయాదవ్‌, మోహన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:07:55+05:30 IST