అత్యాచార బాధితురాలిని ఆదుకుంటాం

ABN , First Publish Date - 2021-06-18T03:53:03+05:30 IST

వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన అత్యాచార బాధితురాలిని ఆదుకుంటామని, వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీబాయి అన్నా రు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గురువారం పరామర్శించి సంఘటనకు వివరాలను బాలికను, ఆమె తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.

అత్యాచార బాధితురాలిని ఆదుకుంటాం
కలెక్టర్‌ను కలిసిన రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యురాలు

ఏసీసీ, జూన్‌ 17 : వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన అత్యాచార బాధితురాలిని ఆదుకుంటామని, వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీబాయి అన్నా రు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గురువారం పరామర్శించి సంఘటనకు వివరాలను బాలికను, ఆమె తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని   సూచించారు. దోషులకు కఠినంగా శిక్షించాలని బాలిక  మహిళా కమిషన్‌ సభ్యురాలికి ఫిర్యాదు అందించారు.  నిందితులకు శిక్ష పడేట్లు చూడటంతోపాటు కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఎక్స్‌గ్రేషియా, ఇతర ఆర్థిక సహాయం గురించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. ముగ్గురు నిందితులపై పోక్సో చట్టం కింద ఇప్పటికే కేసు నమోదైనందున త్వరగా విచారణ పూర్తయి దోషులకు శిక్ష పడేలా చూస్తామన్నారు.  జిల్లా ఇన్‌చార్జి సంక్షేమ శాఖాధికారి ఉమా దేవి, మాజీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్‌ అత్తి సరో జ, సఖి సెంటర్‌ నిర్వాహకురాలు శ్రీలత న్నారు. 

బాధితులకు సత్వర న్యాయం 

మంచిర్యాల కలెక్టరేట్‌: జిల్లాలోని సఖి కేంద్రాలకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. గురువారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కె.ఈశ్వరిబాయి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా  కలిసి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సఖి కేంద్రాలతో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు.  

Updated Date - 2021-06-18T03:53:03+05:30 IST