ఎల్‌జీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు వెల్వెట్‌, వింగ్‌

ABN , First Publish Date - 2020-10-29T05:53:43+05:30 IST

ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్‌ కొత్తగా రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి తెచ్చింది. ఎల్‌జీ వెల్వెట్‌, ఎల్‌జీ వింగ్‌ పేర్లతో వర్చువల్‌గా విడుదల చేసిన

ఎల్‌జీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు వెల్వెట్‌, వింగ్‌

ప్రారంభ ధర 36990


న్యూఢిల్లీ: ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్‌ కొత్తగా రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి తెచ్చింది. ఎల్‌జీ వెల్వెట్‌, ఎల్‌జీ వింగ్‌ పేర్లతో వర్చువల్‌గా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ల ధర రూ.36990 నుంచి ప్రారంభం అవుతుంది. అత్యంత అధునాతనమైన సృజనాత్మక డిజైనింగ్‌ ఉండి మల్టీ టాస్కింగ్‌కు కృషి చేసే కస్టమర్లనుద్దేశించి వీటిని విడుదల చేసినట్టు కంపెనీ తెలిపింది. వెల్వెట్‌ 4జీ హ్యాండ్‌సెట్‌ కాగా వింగ్‌ 5జీ హ్యాండ్‌సెట్‌.


వెల్వెట్‌ : ఇది డ్యుయెల్‌ స్ర్కీన్లలో అందుబాటులో ఉంటుంది. సింగిల్‌ స్ర్కీన్‌ హ్యాండ్‌సెల్‌ ధర రూ.36,990. అదనంగా రూ.13 వేలు చెల్లించి రెండో స్ర్కీన్‌ కొనుగోలు చేయవచ్చు. రెండూ కలిపిన వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. డ్యుయెల్‌ స్ర్కీన్‌ సహాయంతో ఒకే సారి బహుళ యాప్‌లతో పని చేసుకునే వీలుంటుంది.  క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 మొబైల్‌ ప్లాట్‌ఫారం, 6 జీబీ రామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 4300 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. ఈ నెల 30 నుంచి అదుబాటులో ఉంటుంది.


వింగ్‌ : ఇది 5జీ స్మార్ట్‌ఫోన్‌. దీని ధర రూ.69,990. డ్యుయెల్‌ స్ర్కీన్లలో ముందున్న స్ర్కీన్‌ 90 డిగ్రీల కోణంలో అడ్డంగా తిరుగుతుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌ 52, 8 జీబీ రామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమరీ (2 టీబీ వరకు  పెంచుకునే సదుపాయం), 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. ఇది నవంబరు 9 నుంచి అందుబాటులో ఉంటుంది. 

Updated Date - 2020-10-29T05:53:43+05:30 IST