చెన్నైలో చిక్కుకున్న వలస కూలీలకు విముక్తి

ABN , First Publish Date - 2020-05-27T09:45:10+05:30 IST

చెన్నైలో ఉపాధి కోసం వెళ్లి లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిక్కుకున్న గిరిజన వలస కూలీలకు ఎట్టకేలకు స్వగ్రామాలకు తరలించారు.

చెన్నైలో చిక్కుకున్న వలస కూలీలకు విముక్తి

స్వగ్రామాలకు పయనం

ఫలించిన తిరుమారెడ్డి కృషి 


 మెళియాపుట్టి, మే 26: చెన్నైలో ఉపాధి కోసం వెళ్లి లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిక్కుకున్న గిరిజన వలస కూలీలకు ఎట్టకేలకు స్వగ్రామాలకు తరలించారు. సుమారు 20 రోజులు సరిగా తిండిలేక, నిద్రలేక స్వరాష్ట్రానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో కాలికడకన బయలుదేరిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన సుమారు 150 మంది వలస కూలీలు బయలుదేరగా సరిహద్దులో తమిళనాడు పోలీసులు అడ్డుకుని సమీపంలోని ఒక గ్రామ పాఠశాలలో పునరావాసం కల్పించారు. అయితే అక్కడా ఇబ్బందులుపడుతున్న వలస కూలీల ఇబ్బందులపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిపై నాన్‌ పొలి టికల్‌ జేఏసీ నాయకుడు తిరుమారెడ్డి ప్రసాదరావు స్పందించి వలస కూ లీల వివరాలు సేకరించి ప్రభుత్వానికి విన్నవించారు.


టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి సమస్యను తీసుకు వెళ్లగా ఆయన రాష్ట్ర కొవిడ్‌ అధికారి కృష్ణబాబుకు తగు చర్యలు చేప ట్టాలని సూచించారు. వెంటనే ఆయన తమిళనాడు సీఎస్‌కు లేఖ రాసి ఇన్‌చార్జిలుగా రెవెన్యూ అధి కారుల పర్యవేక్షణలో వలస కూలీ లను స్వగ్రామాలకు తరలించే చర్య లు చేపట్టారు. సోమవారం అర్ధ రాత్రి నాలుగు బస్సుల్లో వారంతా స్వగ్రామాల్లోని పునరావాస కేంద్రా లకు వెళ్లేందుకు పయనమయ్యా రు.  తమను ప్రాణాలతో తీసుకు వచ్చేందుకు కృషి చేసిన అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-05-27T09:45:10+05:30 IST