అనుమానిత ఉగ్రవాదికి విముక్తి

ABN , First Publish Date - 2021-06-23T10:06:03+05:30 IST

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎ్‌ససీ)పై 2005లో దాడికి సంబంధించి సమగ్రమైన సాక్ష్యాలు లేనందున అనుమానిత ఉగ్రవాదిని నిర్దోషిగా న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది

అనుమానిత ఉగ్రవాదికి విముక్తి

ఐఐఎస్‌సీపై దాడిలో సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషిగా తీర్పు 


బెంగళూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎ్‌ససీ)పై 2005లో దాడికి సంబంధించి సమగ్రమైన సాక్ష్యాలు లేనందున అనుమానిత ఉగ్రవాదిని నిర్దోషిగా న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. అప్పట్లో ఐఐఎ్‌ససీపై దాడి దేశమంతటా సంచలనం కలిగించింది. 2017లో సీసీబీ పోలీసులు త్రిపురలో అనుమానాస్పద ఉగ్రవాది హబీబ్‌మియాను అరెస్టు చేశారు. ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఉగ్రవాదికి సంబంధించిన సాక్ష్యాలు సమగ్రంగా లేవని తేల్చింది. దీంతో 2017 నుంచి జైలులో గడుపుతున్న హబీబ్‌మియాకు విముక్తి లభించినట్టయింది.  

Updated Date - 2021-06-23T10:06:03+05:30 IST