ఎల్‌ఐసీ... రద్దైన పాలసీల పునరుద్ధరణకు అవకాశం...

ABN , First Publish Date - 2021-01-10T23:37:54+05:30 IST

ప్రీమియం చెల్లించలేక మధ్యలో రద్దైన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎల్‌ఐసీ వెల్లడించింది. రద్దైన లేదా ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం ఎల్‌ఐసీ ఓ ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. మార్చి 6 వరకుఈ కార్యక్రమం కొనసాగనుంది.

ఎల్‌ఐసీ... రద్దైన పాలసీల పునరుద్ధరణకు అవకాశం...

ముంబై : ప్రీమియం చెల్లించలేక మధ్యలో రద్దైన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎల్‌ఐసీ వెల్లడించింది. రద్దైన లేదా ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం ఎల్‌ఐసీ ఓ ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. మార్చి 6 వరకుఈ కార్యక్రమం కొనసాగనుంది. 


పాలసీదారులు తమ రద్దయిన పాలసీలను ఈ మధ్య కాలంలోనే కొన్ని షరతులకు లోబడి  పునరుద్ధరించుకోవాలి. పాలసీ పునరుద్ధరణ కోసం 1526 శాటిలైట్ కార్యాలయాలను ప్రారంభించారు. ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ కోసం  గతేడాది కూడా ఓ కార్యక్రమాన్ని ఎల్‌‌ఐసీ నిర్వహించింది. 


Updated Date - 2021-01-10T23:37:54+05:30 IST