Abn logo
Jun 24 2021 @ 03:12AM

ఎల్‌ఐసీ కొత్త ఐటీ ప్లాట్‌ఫామ్‌

ముంబై : గ్రూప్‌ వ్యాపార కార్యకలాపాల కోసం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కొత్త ఐటీ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించింది. ఈ-పీజీఎస్‌ పేరుతో రూపొందించిన ఈ సెంట్రలైజ్‌డ్‌ వెబ్‌ బేస్డ్‌ వర్క్‌ ఫ్లో ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎల్‌ఐసీ ఇండియా చైర్మన్‌ ఎంఆర్‌కే కుమార్‌ ప్రారంభించారు. ఎల్‌ఐసీ ఎండీలు విపిన్‌ ఆనంద్‌, ముకేశ్‌ గుప్తా, రాజ్‌కుమార్‌, ఎస్‌ మొహం తి, ఐడీబీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాకేశ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ ఐటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా జనరేట్‌ చేసిన తొలి డిజిటల్‌ రసీదును ఐడీబీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాకేశ్‌ శర్మకు ఎల్‌ఐసీ చైర్మన్‌ కుమార్‌ అందజేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌తో ఎల్‌ఐ సీ వసూళ్లు, చెల్లింపుల అకౌంటింగ్‌ పూర్తిగా కేంద్రీకృతమవుతాయని భావిస్తున్నారు.