Abn logo
Sep 19 2021 @ 02:12AM

ఎల్‌ఐసీ.. ప్రగతి మొబైల్‌ యాప్‌

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ).. తన డెవల్‌పమెంట్‌ ఆఫీసర్ల కోసం ‘ప్రగతి’ (పెర్‌ఫార్మెన్స్‌  రివ్యూ అప్లికేషన్‌, గ్రోత్‌ అండ్‌ ట్రెండ్‌ ఇండికేటర్‌) మొబైల్‌ యాప్‌ను తీసుకువచ్చింది. ఎల్‌ఐసీ చైర్‌పర్సన్‌ ఎంఆర్‌ కుమార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లు ముకేశ్‌ గుప్తా, రాజ్‌ కుమార్‌, సిద్ధార్థ మొహం తి, మినీ ఇపే... ఈ యాప్‌ను విడుదల చేశారు. ప్రీమియం వసూళ్లు, ఏజెన్సీ కార్యకలాపాలు సహా వివిధ విభాగాలకు సంబంధించి వ్యాపార నైపుణ్యాల సమాచారాన్ని ప్రగతి యాప్‌ ఎప్పటికప్పుడు డెవల్‌పమెంట్‌ అధికారులకు అందుబాటులో ఉంచుతుందని తెలిపింది. అంతేకాకుండా డెవల్‌పమెంట్‌ ఆఫీసర్లు.. తమ వ్యాపార వ్యూహాలకు పదును పెట్టడంతో పాటు తమ టీమ్‌ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రగతి మొబైల్‌ యాప్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించింది. కాగా వినియోగదారులు, సిబ్బం ది.. సంస్థ కార్యకలాపాలను సులభంగా నిర్వహించేందుకు డిజిటల్‌పరంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ మధ్యనే ఏజెంట్ల కోసం ఆనంద మొబైల్‌ యాప్‌ను ఎల్‌ఐసీ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి పేపర్‌ లేకుండా పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో పాలసీ లు జారీ చేసేలా ఈ యా ప్‌ రూపొందించింది. కాగా రిటైర్డ్‌ ఉద్యోగులు, యాన్యుటెంట్స్‌...ఎల్‌ఐసీ కార్యాలయానికి రాకుండా తమ లైఫ్‌ సర్టిఫికెట్లను సమర్పించేందుకు ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారిత అప్లికేషన్‌ ‘జీవన్‌ సాక్ష్య’ను తీసుకువచ్చినట్లు తెలిపింది.