రెండు వారాలు... రూ. 94 వేల కోట్లు * ఎల్‌ఐసీ వాటాదారుల సంపద హుష్ కాకి

ABN , First Publish Date - 2022-06-04T01:37:33+05:30 IST

ఎల్‌ఐసీ వాటాదారులకు రెండు వారాల్లో రూ. 94 వేల కోట్ల మేరకు సంపద నష్టం వాటిల్లింది.

రెండు వారాలు... రూ. 94 వేల కోట్లు  * ఎల్‌ఐసీ వాటాదారుల సంపద  హుష్ కాకి

ముంబై : ఎల్‌ఐసీ వాటాదారులకు రెండు వారాల్లో రూ. 94 వేల కోట్ల మేరకు సంపద నష్టం వాటిల్లింది. LIC మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈరోజు రూ. 6,00,242 కోట్ల మార్కెట్ క్యాప్‌తో పోలిస్తే రూ. 5,06, 126 కోట్లకు పడిపోయింది. అత్యంత అస్థిరమైన మార్కెట్‌లో బలహీనమైన ఇన్వెస్టర్ సెంటిమెంట్ కారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) షేర్ హోల్డర్లు గత 14 ట్రేడింగ్ సెషన్లలో రూ. 94,116 కోట్లు నష్టపోయారు. నేటి(శుక్రవారం) పతనంతో, భారతీయ మార్కెట్లలో మార్కెట్ క్యాప్ ప్రకారం అగ్రశ్రేణి కంపెనీలపరంగా కంపెనీ ఆరో స్థానానికి పడిపోయింది. లిస్టింగ్ రోజున... LIC ఐదవ స్థానంలో ఉంది. కాగా... ICICI బ్యాంక్ మార్కెట్ క్యాప్(రూ. 5.21 లక్షల కోట్లు) BSEలో బీమా సంస్థ కంటే ఎక్కువగా ఉండటంతో ఒక స్లాట్‌ను కోల్పోయింది. IPO ఇష్యూ ధరకు 8.62 శాతం తగ్గింపుతో ఈ షేరు మే 17న స్వల్పంగా ప్రారంభమైంది. కంపెనీ తన షేర్లను రూ. 902- రూ. 949 ప్రైస్ బ్యాండ్‌లో ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్టాక్ బీఎస్‌ఈలో రూ.  867.20 వద్ద లిస్టైంది. NSEలో... ఈ స్టాక్ IPO ధర కంటే 8.11 శాతం తక్కువగా రూ. 872 వద్ద లిస్టైంది. 


Updated Date - 2022-06-04T01:37:33+05:30 IST