ఎల్‌ఐసీ... రూ. లక్ష కోట్ల సమీకరణ లక్ష్యంతో...

ABN , First Publish Date - 2022-01-14T00:50:56+05:30 IST

ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీ(భారత జీవిత బీమా సంస్థ)... త్వరలోనే అతిపెద్ద ఐపీఓ ద్వారా మార్కెట్‌లోకి ప్రవేశించబోతోన్న విషయం తెలిసిందే.

ఎల్‌ఐసీ... రూ. లక్ష కోట్ల సమీకరణ లక్ష్యంతో...

ముంబై : ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీ(భారత జీవిత బీమా సంస్థ)... త్వరలోనే అతిపెద్ద ఐపీఓ ద్వారా మార్కెట్‌లోకి ప్రవేశించబోతోన్న విషయం తెలిసిందే.  దేశం మొత్తంమీద ఇప్పటివరకు లేనంత స్థాయిలో అతిపెద్ద ఐపీఓగా వస్తోంది. రూ. లక్ష కోట్ల మేరకు  సమీకరిస్తుందని అంచనా. కోల్ ఇండియా సంస్థ మాత్రమే గతంలో రూ. 15 వేల కోట్లను  సమీకరించింది. మళ్లీ ఓ ప్రభుత్వ సంస్థే ఈ  రికార్డును అదిగమించబోతుందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. కాగా... కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 15 లక్షల కోట్లు(203 బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంబెడెడ్ విలువ రూ. 4 లక్షల కోట్లకంటే ఎక్కువగా ఉంటుంది. దాని మార్కెట్ విలువ దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ కావచ్చన్న అంచనాలున్నాయి. తుది నివేదిక తర్వాత దీనిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో... రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 17లక్షల కోట్లుగా ఉంది. తర్వాత స్థానంలో టీసీఎస్ ఉంది. దీని మార్కెట్ క్యాప్ కూడా రూ. 14 లక్షల కోట్లకు పైగానే ఉంది. అయితే ఈ రెండు కంపెనీలకు మధ్యలో... ఎల్‌ఐసీ రానున్నట్లు అంచనాలున్నాయి. అంటే... దేశంలోఅతిపెద్ద రెండో కార్పొరేట్ కంపెనీగా అవతరించే అవకాశాలున్నాయన్నది నిపుణుల అభిప్రాయం. 

Updated Date - 2022-01-14T00:50:56+05:30 IST