381 తుపాకుల అప్పగింత

ABN , First Publish Date - 2021-03-03T12:53:24+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ లైసెన్స్‌ పొందిన ప్రముఖుల నుంచి 381 తుపాకులను వెనక్కి తీసుకున్నట్టు పోలీసులు తెలి పారు

381 తుపాకుల అప్పగింత

చెన్నై/వేలూరు (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ లైసెన్స్‌ పొందిన ప్రముఖుల నుంచి 381 తుపాకులను వెనక్కి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. జిల్లా మొత్తమ్మీద 769 మందికి లైసెన్స్‌తో కూడిన తుపాకులు ఇవ్వగా, అందులో 381 తుపాకులను తమకు అప్పగించినట్టు వివరించారు. మిగిలిన వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-03T12:53:24+05:30 IST