గూగుల్‌ ఇమేజ్‌లకు ‘లైసెన్స్‌’

ABN , First Publish Date - 2020-09-05T05:05:45+05:30 IST

గూగుల్‌ ‘లైసెన్సబుల్‌’ ఇమేజ్‌ లేబుల్‌ను అధకారికంగా ఆరంభించింది.

గూగుల్‌ ఇమేజ్‌లకు ‘లైసెన్స్‌’

గూగుల్‌ ‘లైసెన్సబుల్‌’ ఇమేజ్‌ లేబుల్‌ను అధకారికంగా ఆరంభించింది. ఇమేజ్‌ సెర్చ్‌లో ఫిల్టర్‌ను కూడా ఏర్పాటు చేసింది. తద్వారా వినియోగ హక్కుల్లో మార్పులు చేపట్టింది. ఫలితంగా కొనుగోలు చేయాల్సిన, ఉచితంగా పొందే ఇమేజ్‌ల మధ్య స్పష్టంగా విభజన గీత గీసినట్లయింది. సెంటర్‌ ఆఫ్‌ ద పిక్చర్‌ ఇండస్ట్రీ సహా ఇతర న్యూస్‌, ఇమేజ్‌ అసోసియేషన్లతో కలిసి గూగుల్‌ ఈ విషయమై కొన్నాళ్ళుగా పని చేసింది. దీంతో తమ ఇమేజ్‌లను అమ్ముకునే సౌలభ్యం యజమానులకు ఉంటుందని అలాగే పేరురీత్యా క్రెడిట్‌ కూడా లభిస్తుందని తెలియజేసింది.


ఈ విధానంలో వారి ఇమేజ్‌లపై ‘లైసెన్సబుల్‌’ అన్న బ్యాడ్జ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇక నుంచి ఇమేజ్‌ను ఉపయోగించుకోవాలని అనుకుంటున్న వ్యక్తి/సంస్థ దానికి ఉన్న లింక్‌ ద్వారా కొనుగోలు వివరాలను తెలుసుకోవచ్చు. యూజర్లకు వీలుగా ఉండేందుకు ఫిల్టర్‌ కూడా ఉంటుంది. క్రియేటివ్‌ కామన్‌ లైసెన్సెస్‌ లేదంటే కమర్షియల్‌ అండ్‌ అదర్‌ లైసెన్స్‌ కింద ఉన్న వాటిని తద్వారా ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది.      ఫ

Updated Date - 2020-09-05T05:05:45+05:30 IST