Abn logo
Apr 8 2021 @ 06:33AM

బాలికపై అఘాయిత్యం.. 40 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు

హైదరాబాద్/రంగారెడ్డి : మాయమాటలతో బాలికపై అత్యాచారానికి పాల్పడి, అబార్షన్‌ చేయించిన వ్యక్తికి జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం రంగారెడ్డి జిల్లా మెట్రో పాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సురేష్‌ తీర్పునిచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంగర రాజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లి ఉమామహేశ్వర్‌ కాలనీలో నివసించే కొనగల్లు వేణు (40) కూలీ. అతడు ఓ బాలిక(17)కు మాయమాటలు చెప్పి అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్‌ చేయించాడు. దీపావళి పండుగకు బాలిక చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. అనారోగ్యంగా ఉన్న ఆమెను నిలదీయగా విషయం చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు 2017లో పేట్‌బషీరాబాద్‌ పోలీ‌స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. జడ్జి కేసు పూర్వాపరాలు పరిశీలించి నిందితుడికి జీవితఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Advertisement
Advertisement
Advertisement