జీవిత బీమా పాలసీదారులకు ఊరట

ABN , First Publish Date - 2020-04-06T06:12:37+05:30 IST

జీవిత బీమా పాలసీదారులకు ఐఆర్‌డీఏఐ పెద్ద ఊరట ఇచ్చింది. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో పునరుద్ధరణ (రెన్యువల్‌) కావాల్సిన జీవిత బీమా పాలసీల ప్రీమి యం చెల్లింపు గడువును మరో నెల రోజులు...

జీవిత బీమా పాలసీదారులకు ఊరట

  • ప్రీమియం చెల్లింపు గడువు నెలరోజులు పెంపు

న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీదారులకు ఐఆర్‌డీఏఐ పెద్ద ఊరట ఇచ్చింది. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో పునరుద్ధరణ (రెన్యువల్‌) కావాల్సిన జీవిత బీమా పాలసీల ప్రీమి యం చెల్లింపు గడువును మరో నెల రోజులు పొడిగించింది. మూడు వారాల లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. పాలసీలో ప్రీమియం గడువు పొడిగింపు నిబంధన ఉన్నా, లేకపోయినా ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఆరోగ్య, థర్డ్‌ పార్టీ మోటార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల ప్రీమియం చెల్లింపు గడువునీ ఐఆర్‌డీఏ ఇప్పటికే నెల రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులకూ దీన్ని విస్తరించింది. 

Updated Date - 2020-04-06T06:12:37+05:30 IST