Abn logo
Oct 24 2021 @ 03:04AM

లైఫ్‌ కలర్‌ఫుల్‌గా ఉండాలంటే...

హోమ్‌ మేకింగ్‌

ఇంటికి వేసుకున్న రంగులు వ్యక్తిత్వానికి ప్రతిబింబిస్తాయి. ఎనర్జీని అందిస్తాయి. మూడ్‌ని మారుస్తాయి. అభిరుచిని తెలియజేస్తాయి.  


ఆరెంజ్‌ :


ఉత్సాహం, శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి సహాయపడుతుంది. సంతోషాన్ని ప్రేరేపిస్తుంది. వ్యాయామం చేసే ప్రదేశాల్లో ఈ రంగు వేసుకోవాలి. లివింగ్‌రూమ్‌, బెడ్‌రూమ్‌లకు నప్పదు. 

బ్రైట్‌ రెడ్‌ :

ఎనర్జీ లెవెల్స్‌ను స్టిమ్యులేట్‌ చేస్తుంది. ఎడ్రినలిన్‌ హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. లివింగ్‌, డైనింగ్‌ రూమ్‌లకు ఈ రంగు వేసుకోవచ్చు. 

డార్క్‌ రెడ్‌ :

మీ అభిరుచిని సూచిస్తుంది. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా దూసుకెళ్లడానికి సహాపడుతుంది. 

పసుపు రంగు :

సంతోషాలను ప్రతిబింబిస్తుంది. తెలివితేటలు, మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది. కిచెన్‌, డైనింగ్‌ ఏరియాలో వేసుకోదగిన రంగు ఇది. ఇంట్లో దారుల దగ్గర వేస్తే వెల్‌కమ్‌ ఫీల్‌ ఇస్తుంది. 

లేత నీలం :

గుండె వేగాన్ని, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పడకగదులు, బాత్‌రూమ్‌లకు ఈ రంగు నప్పుతుంది. లివింగ్‌రూమ్‌లో ప్రైమరీ కలర్‌గా ఎంచుకోవచ్చు. అలాంటప్పుడు ఫర్నీచర్‌ వార్మ్‌ కలర్‌ ఉండేలా చూసుకోవాలి. అనుబంధాలను పెంచుతుంది. దూకుడు తత్త్వాన్ని తగ్గిస్తుంది.

ముదురు నీలం :

ప్రశాంతతను ఇస్తుంది. ఆలోచనలను ప్యూరిఫై చేస్తుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో ముదురు నీలం రంగు దుస్తులు ధరించమని సూచించడం వెనక మతలబు అదే. 

ఆకుపచ్చ :

కళ్లను రీఫ్రెష్‌ చేసే రంగు ఇది. ఇంట్లో ఏ గదికైనా వేసుకోవచ్చు. ముఖ్యంగా పడకగదులకు బాగా నప్పుతుంది. ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడుతుంది. 

పింక్ :

అవగాహన, వినే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎమోషనల్‌గా ఉన్న సందర్భంలో ఓదార్పును ఇస్తుంది.