చారిత్రక కట్టడానికి జీవం

ABN , First Publish Date - 2021-05-08T04:29:52+05:30 IST

మదనాపురం అనగానే అం దరికీ గుర్తుకు వచ్చేది రైల్వేస్టేషన్‌, స్థానికంగా అయి తే మిల్లులు అధికంగా ఉండడంతో వ్యాపారపరంగా రెండవ ముంబాయి అని పిలిచే వారు.

చారిత్రక కట్టడానికి జీవం
సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న నూతన పోలీస్‌స్టేషన్‌

  - నిజాం కాలంలో ఔట్‌పోస్టుగా నిర్మాణం

- కాలక్రమేణ శిథిలావస్థకు చేరిన భవనం

 - దాతల సహకారంతో అన్ని హంగులతో  పోలీస్‌ స్టేషన్‌ పునరుద్ధరణ

- రేపు ప్రారంభించనున్న మంత్రులు, ఎస్పీ  

మదనాపురం, మే 7: మదనాపురం అనగానే అం దరికీ గుర్తుకు వచ్చేది రైల్వేస్టేషన్‌, స్థానికంగా అయి తే మిల్లులు అధికంగా ఉండడంతో వ్యాపారపరంగా రెండవ ముంబాయి అని పిలిచే వారు. రాకపోకలకు అనుకూలంగా ఉండటంతో వ్యాపారు లు బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లి వ్యాపారాలు కొనసాగించేవారు. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకొని నిజాంపాలనలో సుమారు 1927వ సంవ త్సరంలో రైల్వేస్టేషన్‌కు భద్రత కోసం అతి సమీపం లో పోలీస్‌ ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు.  అప్పుడు ఇద్దరు కానిస్టేబుల్‌, ఒక ఏఎస్‌ఐ విధులు నిర్వహిం చేవారు. కాల క్రమేణ ఔట్‌పోస్టును ఎత్తివేయడంతో అక్కడ ఉన్న భవనాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం తో చారిత్రక కట్టడం శిథిలావస్థకు చేరింది. తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కొత్త మం డలాలను ఏర్పాటు చేసింది. అప్పుడు మదనా పురం మండల కేంద్రంగా ఏర్పాటు కాగా, పోలీస్‌స్టేషన్‌ అద్దె భవనం లో ఏర్పాటు చేశారు. కాని అ క్కడ సరైన వసతులు లేక సిబ్బంది ఇబ్బందులకు గురయ్యేవారు.  పాత పోలీస్‌ స్టేషన్‌ (ఔట్‌పోస్టు) స్థలం సుమారు ఎకరా నికిపైగా ఉండడంతో అక్కడే ఉన్న భవనానికి మర మ్మతులు చేయిస్తే సౌకర్యంగా ఉంటుందని భా వించారు. దాతలు కూడా పునఃనిర్మాణానికి అవసర మయ్యే మెటీరియల్స్‌ను అందజేశారు. ఇలా అందరు కలిసి నూతన పోలీ స్‌స్టేషన్‌ను ఇంద్రభవనంలా ని ర్మించారు.  పునఃనిర్మాణమైన పోలీస్‌స్టేషన్‌ను ఆది వారం మంత్రులు, ఎస్పీ, ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్‌రెడ్డి ప్రారంభించనున్నారు.  

దాతల సహకారం మరువలేనిది  

పాత ఔట్‌పోస్టును పోలీస్‌స్టేషన్‌గా పునరుద్ధరించడా నికి దాతల సాయం మరువలేనిది. మా మండలంలో స్వంతంగా పోలీస్‌ స్టేషన్‌ ఉండాలనే భావనతో స్వ చ్ఛం దంగా చాలా మంది తమకు తోచిన మెటీరియల్స్‌, మేస్ర్తీ ల కూలీలను భరించారు. దీనికి జిల్లా ఎస్పీ  అపూర్వా రావు సంపూర్ణ సహకారం అందించారు.  

- తిరుపాజి, ఎస్‌ఐ, మదనాపురం

Updated Date - 2021-05-08T04:29:52+05:30 IST