ఔటర్‌పై ప్రాణదాత..1066

ABN , First Publish Date - 2021-01-18T08:31:02+05:30 IST

ఇంతకు ముందు ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు జరిగితే.. 108కు ఫోన్‌ చేసేవారు. అంబులెన్స్‌లు వచ్చేసరికి కొంత ఆలస్యం జరిగేది. మరికొన్ని సందర్భాల్లో తోటి ప్రయాణికులు టోల్‌గేట్ల వద్ద సమాచారం

ఔటర్‌పై ప్రాణదాత..1066

సత్ఫలితాలనిస్తున్న అడ్వాన్స్‌ 

లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌లు

ప్రమాదం జరిగిన వెంటనే 

ట్రామా కేర్‌ సెంటర్లకు

రెండు నెలల్లో 100 మందికి ‘గోల్డెన్‌ అవర్‌’ చికిత్స

లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌లతో సత్ఫలితాలు


హైదరాబాద్‌ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఇంతకు ముందు ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు జరిగితే.. 108కు ఫోన్‌ చేసేవారు. అంబులెన్స్‌లు వచ్చేసరికి కొంత ఆలస్యం జరిగేది. మరికొన్ని సందర్భాల్లో తోటి ప్రయాణికులు టోల్‌గేట్ల వద్ద సమాచారం అందిస్తేగానీ, విషయం తెలిసేది కాదు. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు రెండు నెలల క్రితం 1066 టోల్‌ఫ్రీ నంబరును పరిచయం చేశారు. ఆనంబరుకు ఫోన్‌ చేయగానే.. దగ్గర్లో ఉన్న అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌లు సంఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులకు ప్రథమ చికిత్సను అందిస్తాయి. ఆ తర్వాత ట్రామాకేర్‌ సెంటర్లకు తరలిస్తాయి. ఇక్కడ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆ ఖర్చును హెచ్‌ఎండీఏ భరిస్తోంది. ఇలా ‘గోల్డెన్‌ అవర్‌’ను పూర్తిస్థాయిలో వినియోగించుకుని, క్షతగాత్రులకు చికిత్స అందించేలా అధికారులు పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.


వనరులు ఇలా..

  • ఔటర్‌పై ప్రతి 16 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అంబులెన్స్‌ను అందుబాటులో పెట్టారు.
  • వీటిలో ఆక్సిజన్‌ వ్యవస్థ, రెస్పిరేటరీ సపోర్ట్‌, వెంటిలేటర్‌, డెఫిబ్రిటలెటర్‌, డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌,  పరీక్షల నిర్వహణ ఉపకరణాలు ఉంటాయి.
  • ఓఆర్‌ఆర్‌పైన ఉన్న 10 టోల్‌ బిల్డింగ్‌ల వద్ద ట్రామాకేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. 
  • అంబులెన్స్‌లు, ట్రామాకేర్‌ సెంటర్ల బాధ్యతను నగరానికి చెందిన ప్రముఖ ఆస్పత్రులను నిర్వహించే సంస్థకు అప్పగించారు.

Updated Date - 2021-01-18T08:31:02+05:30 IST