నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-02T00:11:17+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లును అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేశారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లును అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకు ఒక టీఎంసీ చొప్పున నీటినిల్వలు పెరుగుతున్నాయి. శ్రీశైలం జలాశయం 5లక్షల క్యూసెక్కుల వరద నీరు నుంచి వస్తోంది. సాగర్ ఎగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. అంతేకాకుండా కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో వరద ఉధృతి పెరగుతుండడంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కృష్ణమ్మ ఉప్పొంగుతుండటంతో కుడికాలువ ఆయకట్టు కర్షకుల్లో ఆనందం వెల్లివిరుస్తోది. వరిసాగుకు రైతులు సమాయత్తమయ్యారు. కాలువకు నీరు విడుదల కాగానే వరి నారుమళ్లు పోసేందుకు విత్తన సేకరణతో పాటు పొలాలను దున్ని సిద్ధం చేస్తున్నారు. ఆయకట్టులో వరిసాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Updated Date - 2021-08-02T00:11:17+05:30 IST