ఎత్తిపోతలకు రాజకీయ గ్రహణం

ABN , First Publish Date - 2021-06-17T05:57:39+05:30 IST

మండలంలోని వేంపాడు పరిధి చిలకలేరు వాగుపై నిర్మించిన గొట్టిపాటి హనుమంతరావు ఎత్తిపోతల పథకానికి రాజకీయ గ్రహణం పట్టింది. చక్కగా సాగుతున్న ఎత్తిపోతల పథకానికి ఐడీసీ అధికారులు తాళాలు వేశారు. కమిటీ సక్రమంగా నిర్వహించటం లేదనే సాకుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం తప్ప మరొకటి లేదని పథకం పరిధిలోని రైతులు ఆదోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎత్తిపోతలకు రాజకీయ గ్రహణం
గొట్టిపాటి హనుమంతరావు ఎత్తిపోతల పథకానికి తాళం వేసిన ఐడీసీ అధికారులు

తాళాలు వేసిన ఐడీసీ అధికారులు 

నువ్వు, సుబాబులు పంటలు సాగు చేసిన రైతుల ఆందోళన 

వేరే వారికి కట్టబెట్టాలనే 

ఉద్దేశంతోనే ఈ డ్రామా

ముండ్లమూరు, జూన్‌ 16 : మండలంలోని వేంపాడు పరిధి చిలకలేరు వాగుపై నిర్మించిన గొట్టిపాటి హనుమంతరావు ఎత్తిపోతల పథకానికి రాజకీయ గ్రహణం పట్టింది. చక్కగా సాగుతున్న ఎత్తిపోతల పథకానికి ఐడీసీ అధికారులు తాళాలు వేశారు.  కమిటీ సక్రమంగా నిర్వహించటం లేదనే సాకుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  దీని వెనుక రాజకీయ దురుద్దేశం తప్ప మరొకటి లేదని పథకం పరిధిలోని రైతులు ఆదోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పథకం ఈ కింద రైతులు నువ్వులు, జామాయిలు, సుబాబులు తదితర పంటలు సాగులో ఉన్నాయి. దీంతో పాటు చెరువుకు నీరు పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఐడీసీ అధికారులు మాత్రం లేని సమస్యను తెరమీదకు తెచ్చారు. స్కీమ్‌ నిర్వాహణలో రైతుల మధ్య సమన్వయం లోపించిందని పేరొన్నారు. దీంతో  సమస్యలు వస్తున్నాయని తాళాలు వేశారు.  అయితే రైతులు మాత్రం రాజకీయ దురుద్ధేశ్యంతోనే అధికారులతో తాళాలు వేయించినట్లు రైతులు పేర్కొంటున్నారు.  

ఆ గ్రామంలో ఇటీవల రాజకీయంగా మార్పులు జరిగాయి. దీంతో అధికార పార్టీకి చెందిన వైసీపీ నాయకులు తమ చేతుల్లోకి ఎత్తిపోతల పథకం నిర్వాహణ తీసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. దీంతో సంబంధిత  అధికారులపై ఒత్తిడి తెచ్చి తాత్కాలికంగా తాళాలు వేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సక్రమంగా వర్షాలు పడడటంతో చిలకలేరు వాగుల్లో పుష్కలంగా నీరు ఉంది. దీనికి తోడు సాగర్‌ జలాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల మూగ జీవాల దాహార్తి కోసం విడుదల చేయటంతో ఎత్తిపోతల పథకం సక్రమంగా పని చేస్తోంది. అవసరమైనప్పుడు సంబంధిత రైతులు ఎత్తిపోతల పథకం ద్వారా పొలాలకు నీరు పెట్టుకుంటున్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీ పరిధిలో స్కీం ఉండకూడదనే లక్ష్యంతోనే తాళాలు వేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి యథావిధిగా ఎత్తి పోతల పథకాన్ని కొనసాగించాలని పథకంలోని రైతులు వేడుకుంటున్నారు. 

జీవో ప్రకారమే కమిటీ రద్దు చేశాం  

 జీవో ప్రకారం కమిటీని రద్దు చేశాం. ఇక నుంచి మేమే ఎత్తిపోతల పథకాన్ని నిర్వహిస్తాం. తాళాలు వేసిన మాట వాస్తవమే. దీనిలో ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. రైతుల్లో సామరస్యం, అవగాహన లేకపోవడంతో తాళాలు వేయాల్సి వచ్చింది. రైతులందరూ ఒకచోట కూర్చొని కూర్చొని నూతన కమిటీని ఎంచుకుంటే మాకేమి అభ్యంతరం లేదు.

 - ఉదయ భాస్కర్‌ ,  ఐడీసీ డీఈ 

Updated Date - 2021-06-17T05:57:39+05:30 IST