రెండు రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2021-05-08T07:56:07+05:30 IST

రాష్ట్రంలో కొన్నిచోట్ల రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది.

రెండు రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొన్నిచోట్ల రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఒకటి, రెండుచోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఉత్తర కర్ణాటక నుంచి ఉత్తర కేరళ సముద్రమట్టం వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

Updated Date - 2021-05-08T07:56:07+05:30 IST